'3వ మహాసభలను విజయవంతం చేయాలి'

RR: జర్నలిస్టుల ఐక్యతనే సంఘం బలమని TWJF రాష్ట్ర కార్యదర్శి బసవపున్నయ్య అన్నారు. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి వద్ద నిర్వహించిన 3వ మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే నెలలో రంగారెడ్డి జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.