స్వచ్ఛ సర్వేక్షన్‌లో ప్రజలు భాగస్వాములు కావాలి

స్వచ్ఛ సర్వేక్షన్‌లో ప్రజలు భాగస్వాములు కావాలి

SRPT: స్వచ్ఛ సర్వేక్షన్ 2026లో ప్రజలు భాగస్వాములై పట్టణానికి జాతీయ గుర్తింపు తేవాలని మున్సిపల్ ఛైర్మన్ మొరిశెట్టి నివేదిత కోరారు. బుధవారం సద్దుల చెరువు వద్ద వాకర్స్‌కు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సూర్యాపేటను అగ్రస్థానంలో నిలిపేందుకు సహకరించాలని కమిషనర్ హన్మంతరెడ్డి కోరారు.