26 నుంచి శ్రీ రామనవమి ఉత్సవాలు ప్రారంభం
అన్నమయ్య: రామసముద్రం మండలం కెసిపల్లి పంచాయతీ వై.కురప్పల్లిలోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో ఈనెల 26 నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు కె.లక్ష్మీ నారాయణ ఇవాళ తెలిపారు. 26 నుంచి 30వ తేదివరకు జరుగుతాయని చెప్పారు. ప్రతిరోజు వివిధ అలంకారంలో స్వామివారు దర్శనం ఇస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.