నీటి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే

GNTR: గుంటూరులో నీటి సమస్య బుధవారం సాయంత్రం, గురువారం లోపు పరిష్కారం అవుతుందని పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు సమ్మెలో ఉండటం, అదే సమయంలో నగరానికి నీటిని సరఫరా చేసే పైప్‌లైన్‌లు మరమ్మతులకు గురవ్వడంతో సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. నీటి సమస్యలున్న ప్రాంతాలకు ట్యాంకర్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు.