VIDEO: ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

KMR: నస్రుల్లాబాద్ మండలంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి విద్యార్థులు శోభాయాత్రగా బయలుదేరి గ్రామంలోని జెండాలను ఆవిష్కరించారు. 'జై జవాన్-జై కిసాన్', 'స్వతంత్య్ర భారతమాతాకీ జై' వంటి నినాదాలతో గ్రామంలోని వీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డీ. చందర్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.