ఎంవీపీ రైతు బజార్ తనిఖీ

VSP: రైతు బజార్లలో తాజా కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువుల లభ్యత , నాణ్యతను రైతు బజార్ల సీఈవో మాధవి లత తనిఖీ చేశారు. గరువారం ఆమె రైతు బజార్‌ను తనిఖీ చేసి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.అనంతరం రైతులతో, అక్కడ కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆమె రైతు బజార్ల నిర్వహణ, పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు.