తెలుగు యువత అధ్యక్షుడిగా బాలకృష్ణ

ELR: దెందులూరు గ్రామ తెలుగు యువత అధ్యక్షుడిగా బాలకృష్ణను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం నియమించారు. దెందులూరు మండల అధ్యక్షుడు మిల్లు బాబు, క్లస్టర్ ఇన్‌ఛార్జి చౌదరి, జిల్లా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి ఇప్పిలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు సర్పంచ్ తోట ఏసమ్మ పాల్గొన్నారు.