మండిపోతున్న భానుడు.. అల్లాడుతున్న జనజీవనం..!
MHBD: ఉమ్మడి జిల్లాలో భానుడు ప్రతాపం కొనసాగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు తీవ్రంగా మారాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు మండిపోతుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. విద్యార్థులు, చిన్న వ్యాపారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం ముందే రహదారులు వేడెక్కి జనజీవనం స్తంభిస్తోంది. అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.