18 మంది మావోయిస్టులు మృతి: ఐజీ
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 9 మంది మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా బస్తర్ ఐజీ మాట్లాడుతూ.. మావోయిస్టులు త్వరగా లొంగిపోవాలని.. లేకపోతే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఈ కాల్పుల్లో మరణించిన వారిపై రూ.1.3 కోట్ల రివార్డు ఉన్నట్లు తెలిపారు.