'ఆ టీచర్లపై చర్యలు తీసుకోవాలి'
NRPT: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని POW జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ డిమాండ్ చేశారు. మద్దూరు మండలం మోమినాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థినిపై అవమానకరంగా ప్రవర్తించిన స్వామిని, వీడియోను మరో మైనర్‌కు పంపిన గురునాథ్ రెడ్డిని సస్పెండ్ చేయాలన్నారు. అలాగే వీడియో వైరల్ చేసినందుకు కఠిన శిక్షలు విధించాలని కోరారు.