అకాల వర్షాలతో అపార నష్టం

అకాల వర్షాలతో అపార నష్టం

ASR: అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. అడ్డతీగల, గంగవరం, దేవీపట్నం మండలాల్లో దాదాపు 3వేల ఎకరాల్లో రబీ వరి సాగు చేసిన రైతుల కంటిమీద కునుకు లేకుండా చేశాయి. కష్టపడి పండించిన ధాన్యం వర్షాలతో తడిచిపోయింది. అడ్డతీగల మండలం పాపంపేట, చేనుపాకలు గ్రామాల్లో టార్పాలిన్లు కప్పిన అవి గాలికి ఎగిరిపోవడంతో తడిచిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.