వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రాలు
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం దాటిన పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. నియోజకవర్గంలోని ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల సంఘం అవగాహన కల్పించినా.. ఓటర్లు మాత్రం ఓటుహక్కు వినియోగించుకోవడానికి కదలడం లేదు. బస్తీల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో మందకొడిగా ఓటింగ్ సాగుతోంది. ఇప్పటి వరకు 20.76 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.