విద్యాశాఖ డైరెక్టర్‌గా తమీమ్ అన్సారియా

విద్యాశాఖ డైరెక్టర్‌గా తమీమ్ అన్సారియా

GNTR: ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి తమీమ్ అన్సారియా బాధ్యతలు చేపట్టనున్నారు. బీఈ, ఎంఏ చదివిన ఆమె గతంలో శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌గా, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా సమర్థవంతంగా పనిచేశారు. ముఖ్యంగా బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆమె విశేష కృషి చేశారు. విద్యాశాఖలోనూ ఆమె కీలక సంస్కరణలు తీసుకొస్తారని భావిస్తున్నారు.