గొర్రెపల్లి శివారులో వ్యక్తి ఆత్మహత్య

గొర్రెపల్లి శివారులో వ్యక్తి ఆత్మహత్య

JGL: మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంగళారపు లక్ష్మీనర్సయ్య (43) గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.