డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే అప్పగించాలి: సీపీఐ

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే అప్పగించాలి: సీపీఐ

BHNG: భువనగిరి పట్టణం సింగన్నగూడెంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన నిలుస్తుందని, డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.