'సాగునీరు విడుదల షెడ్యూల్ ప్రకటించాలి'
KMM: వైరా రిజర్వాయర్ ఆయకట్టుకు రబీ సీజన్ సాగునీరు విడుదల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రం అందించారు. రైతులకు రబీ సీజన్ సాగునీరు విడుదలపై స్పష్టత లేకపోవడంతో సాగు విషయంలో ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు.