ఇద్దరు మున్సిపల్ ప్లానింగ్ సెక్రటరీలకు ఛార్జ్ మెమోలు

E.G: తణుకు మున్సిపల్ పరిధిలో ఇద్దరు వార్డు ప్లానింగ్ సెక్రటరీలకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ ఛార్జిమెమోలను జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించి అక్రమంగా భవన నిర్మాణాలు, అదనపు అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ అడ్డుకోకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో టి.సత్యతేజ, వట్టికూటి సురేష్ కుమార్‌లకు ఛార్జిమెమోలు ఇచ్చినట్లు కమిషనర్ తెలిపారు.