నేడు జిల్లాలో భారీ వర్షాలు

నేడు జిల్లాలో భారీ వర్షాలు

ATP: మొంథా తుఫాను తీరాన్ని తాకడంతో నేడు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జిల్లా ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వర్షం పడేవేల ప్రజలు ఎవరూ బయట ఉండొద్దని, శిథిలావస్థ భవనాల్లో ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. అయితే జిల్లాలో నిన్నటి నుంచి మోస్తారు వర్షం పడుతూనే ఉంది.