నేడు తిరువూరుకు 'కిష్కింధపురి' మూవీ టీమ్

NTR: హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన 'కిష్కింధపురి' సినిమా యూనిట్ గురువారం తిరువూరులోని శ్రీ వాహిని కళాశాలలో సందడి చేయనుంది. ఈ నెల 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం మూవీ టీమ్ మధ్యాహ్నం 3 గంటలకు తిరువూరు వస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.