ఆదోని జిల్లా సాధన దీక్ష 33వ రోజు
KRNL: ఆదోని జిల్లా ఏర్పాటు కోసం చేపట్టిన రిలే దీక్ష 33వ రోజుకు చేరుకుంది. దీక్ష శిబిరంలో సినీ ఆర్టిస్టులు భారీగా పాల్గొని, సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గురువారం మాట్లాడుతూ.. జిల్లా ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. మూతపడిన ఆదోని ఈఎస్ఐ హాస్పిటల్‌ను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.