VIDEO: సైనికులకు సెల్యూట్ కొడుతున్న టోల్‌గేట్ సిబ్బంది

ఇటీవల సైనికుడు కపిల్‌పై మేరఠ్ టోల్‌గేట్ సిబ్బంది దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ టోల్ ఏజెన్సీకి ప్రభుత్వం రూ.20 లక్షల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో UPలోని మిగిలిన టోల్‌గేట్ల సిబ్బంది సైనికులతో మర్యాదగా నడుచుకుంటున్నారు. సైనిక వాహనాలు కన్పిస్తే సెల్యూట్ చేస్తూ.. వారికి తాగునీటి సీసాలు అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.