హోలీ వేళ గాడిదపై కొత్తల్లుడి ఊరేగింపు
మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో వింత ఆచారం కొనసాగుతోంది. గ్రామంలో ఇటీవల వివాహం జరిగిన వారి ఇంటి నుంచి కొత్త అల్లుడిని ఆహ్వానిస్తారు. అనంతరం స్థానికులంతా కలిసి అతడికి కొత్త దుస్తులు కొనిచ్చి.. రంగులు చల్లి గాడిదపై ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఊరేగింపు పూర్తయ్యాక కొత్త అల్లుడికి ఊరి ప్రజలంతా బహుమతులిస్తారు. ఈ ఆచారం గత 90 ఏళ్లుగా కొనసాగుతోంది.