ఘాట్‌రోడ్డులో పనులు.. టీటీడీ కీలక సూచన
AP: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బీటీ రోడ్డు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం రహదారిని మూసివేయకుండా, నిర్దేశిత సమయాల్లో పనులు చేపడుతున్నట్లు టీటీడీ తెలిపింది. పనుల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉన్నందున రైల్వే స్టేషన్, విమానాశ్రయాలకు వెళ్లే వారు గంట ముందే బయలుదేరాలని సూచించింది.