VIDEO: దొంగతనాలపై మున్సిపల్ సిబ్బంది వినూత్నప్రచారం
KMR: వేసవిలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున కామారెడ్డి 35వ వార్డులో మున్సిపల్ సిబ్బంది వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. చెత్త సేకరణ వాహనం ద్వారా మైకులో ప్రచారం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇంటికి తాళం వేసి మేడలపై పడుకోవద్దని, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.