VIDEO: పాత వంతెనపై రాకపోకల్లో సడలింపు
KMM: కాల్వొడ్డు వద్ద మున్నేటి పాత వంతెనపై వాహనాల రాకపోకల అనుమతికి సంబంధించి, సమయంలో మార్పులు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తుండగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకే రాకపోకలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామని ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు.