లింగాకృతిలో కార్తీక దీపోత్సవం
MDK: శివంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాసం పూజలు ఘనంగానే నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ఆంజనేయ శర్మ, ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కార్తీకమాసం పురస్కరించుకొని ఆలయంలో లింగాకృతిలో కార్తీక దీపోత్సవం చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.