కేజీహెచ్‌లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి సస్పెండ్
VSP: కేజీహెచ్‌లో రోగుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన అవుట్‌సోర్సింగ్ శానిటేషన్ వర్కర్ సిరిపురాపు మధును విధుల నుంచి తొలగించారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో శనివారం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులను డబ్బులు అడిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.