జనగణన పేరుతో సైబర్ మోసాలు: కలెక్టర్
కోనసీమ: జనగణన పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ... జనాభా లెక్కించే సిబ్బంది వివరాలు, ఫోన్ నంబర్లు మాత్రమే సేకరిస్తారని, ఓటీపీలు అడగరని తెలిపారు. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పవద్దని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల అవగాహన కలిగి ఉండాలన్నారు.