ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ స్పందన

ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ స్పందన

గద్వాల జిల్లా ఎస్పీ టీ. శ్రీనివాసరావు ఇవాళ ప్రజావాణి కార్యక్రమంలో 10 ఫిర్యాదులు స్వీకరించారు. బాధ్యతగా ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా త్వరగా స్పందించి పరిష్కరించాలని ఎస్‌హెచ్‌వోలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భూ వివాదాలు, గొడవలకు సంబంధించిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల పురోగతిని బాధితులకు తెలియజేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు.