బొండపల్లిలో వైసీపీ యువత బైక్ ర్యాలీ
VZM: మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీకి చెందిన యువత మండల నాయకుడు బోడసింగి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం బొండపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలోని మెడికల్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు. పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.