నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం చేసిన సర్పంచ్
MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ 12వ వార్డులో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. గతంలో ఉన్న లో వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ కాకులమర్రి శ్రీలత ప్రత్యేక కృషి చేసి ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేయించారు. మంగళవారం సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలతో ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు.