ఆసుపత్రిపై దాడి కేసులో ఏడుగురు అరెస్ట్

ఆసుపత్రిపై దాడి కేసులో ఏడుగురు అరెస్ట్

ATP: అనంతపురం సాయి నగర్‌లోని శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిపై దాడి చేసి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిన ఘటనలో అడ్వకేట్ మొగలి సత్యనారాయణ రెడ్డితో సహా ఏడుగురు నిందితులను టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో వారిని జిల్లా జైలుకు తరలించారు. హత్యాయత్నం, అక్రమ ప్రవేశం కింద వీరిపై కేసు నమోదు చేశారు.