వ్యక్తిపై కోడి కత్తితో దాడి..

వ్యక్తిపై కోడి కత్తితో దాడి..

క‌ృష్ణా: మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన కందుల గోపిపై ఆదివారం రాత్రి కొంతమంది వ్యక్తులు కోడి కత్తులతో దాడి చేశారు. ఇంటి సరిహద్దు వివాదంలో ముగ్గురు వ్యక్తులు కలిసి కోడి కత్తులతో తనపై దాడి చేశారని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నాడు. ప్రస్తుతం గోపి మైలవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.