బ్రెయిన్ స్ట్రోక్తో బాలిక మృతి
SDPT: బాలల దినోత్సవం రోజే బాలిక మృతి చెందిన ఘటన అక్కన్నపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. అక్కన్నపేట మండలం గౌరవెల్లికి చెందిన బాలిక (11) అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందింది. నివేదిత హుస్నాబాద్ పట్టణంలోని ఓ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.