శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం ఛైర్మెన్‌గా మహేష్ యాదవ్

తిరుపతి: గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలకమండలి ఛైర్మన్‌గా టీడీపీ నేత మహేష్ యాదవ్ (మక్కి)ని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గంగమ్మగుడి ఛైర్మెన్ పదవి కోసం జనసేన టీడీపీ మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో టీడీపీ నేతకే ఛైర్మెన్ పదవి వరించింది. మొత్తం జనసేన, టీడీపీ, బీజేపీ కార్యర్తలు 41 మందితో పాలకమండలి ఏర్పాటు చేయనున్నారు.