ఒక్క వినతి.. వైన్ షాప్ తరలింపుకు మంత్రి ఆదేశం..!
HYD: బేగంపేట పరిధి గురుమూర్తి కాలనీలో వైన్ షాపు ఉండడంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లల భద్రత కోసం వైన్ షాపు వేరే ప్రాంతానికి తరలించాలని మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన త్వరలోనే వైన్ షాప్ తరలించాలని ఆదేశించారు. మంత్రి స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.