వరికుంటపాడులో 84ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం

వరికుంటపాడులో 84ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం

NLR: వరికుంటపాడు మండల కేంద్రంలో 84 ఏళ్ల వృద్ధురాలిపై 34 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరికుంటపాడు ప్రధాన రహదారి వెంబడి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.