మృతదేహాన్ని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి: SI సాంబమూర్తి
BHPL: జిల్లా SP కార్యాలయం సమీపంలోని బొబ్బగాటి చెరువులో మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. SI సాంబమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి వయసు 40-50 ఏళ్ల మధ్య ఉండవచ్చు. ఆకుపచ్చ టీషర్టు, నలుపు లోయరు ధరించి, కుడి చేతికి దేవుని దండ ఉన్నట్లు గుర్తించారు. వివరాలు తెలిస్తే 8712658120, 8712658121 నెంబర్లను సంప్రదించాలని కోరారు.