VIDEO: ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో ఇంటింటి ప్రచారం
NZB: ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ప్రమల్ల వినోద్ గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆయన వెంటరాగా, వినోద్ ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.