కోమరోలు మండలంలో 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

కోమరోలు మండలంలో 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ప్రకాశం: కొమరోలు మండలంలోని రెడ్డిచర్ల, ఎస్సీపాలెంలో సీఐ రామకోటయ్య, ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో శనివారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామకోటయ్య తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు, ఈ తనిఖీలు నిర్వహించామని సిఐ రామకోటయ్య అన్నారు.