కొండుకుదురు హైస్కూల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

కొండుకుదురు హైస్కూల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

కోనసీమ: అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్‌ను స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్కూల్‌లో విద్యార్థులను మధ్యాహ్న భోజన పథకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించారు. పాఠశాల హెచ్ఎం పలు సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు.