అమరావతికి చట్టబద్ధతపై మహిళా నాయకులు హర్షం
E.G: అమరావతిని రాజధానిగా పార్లమెంట్ చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తూ రాజమండ్రిలో ఆదివారం తెలుగు మహిళలు ‘మన రాజధాని–మన అమరావతి’ అంటూ రంగవల్లులు వేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వీటిని తిలకించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, నాయకులు పాల్గొన్నారు.