'విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం దేశవ్యాప్త ఉద్యమం'

VSP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు జె. అయోధ్యరామ్ పిలుపునిచ్చారు. రూర్కెలాలో జరిగిన 10వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ఆదివారం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, అది ఏకగ్రీవంగా ఆమోదించబడింది.