భీమడోలులో టీడీపీ కార్యకర్తల సమావేశం
ELR: భీమడోలు కాంపు కార్యాలయంలో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అధ్యక్షతనలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలపై పలు అర్జీలను, CMRF కోసం దరఖాస్తులను ఆయనకు అందించారు. ఆయన సమస్యలను ఫోన్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, తగు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రివెన్స్ కూడా నిర్వహించారు.