ఘనంగా టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు

PPM: టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోబిక హాజరై టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు.