మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

AP: మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. త్వరలో జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు.