నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BDK: ఇల్లందు విజయలక్ష్మి నగర్‌లో నేడు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు సర్పంచ్ రమేశ్ తెలిపారు. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు దృష్ట్యా ఈ పనులకు గ్రామస్థులు సహకరించాలని కోరారు. తమ పరిసరాల్లో విద్యుత్ తీగలకు తగులుతున్న చెట్లను గుర్తించి సిబ్బందికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.