సుపరి పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: చింతలపూడి మండలం సమ్మిటివారిగూడెం గ్రామంలో సుపరి పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ బుధవారం పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక నేతలు పాల్గొన్నారు.