'ప్రతి ఒక్కరూ స్వామిత్వ సర్వే చేయించుకోవాలి'
SKLM: స్వామిత్వ సర్వేను ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని కోటబొమ్మాళి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఫణీంద్ర కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక మండలం గంగరాం గ్రామపంచాయితీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలాలు వివరాలు సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. దీనికి సంబంధించిన నోటీసులపై సంబంధిత యజమానులు సంతకాలు చేయాలన్నారు.