అనారోగ్యంతో సీలేరు ఏఎస్సై మృతి

అనారోగ్యంతో సీలేరు ఏఎస్సై మృతి

ASR: జీకేవీధి మండలం సీలేరు పోలీసు స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న బుజ్జి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. ఏఎస్సై గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై యాసీన్ తెలిపారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందారన్నారు. దీంతో జీకేవీధి సీఐ బీ.సుధాకర్, ఎస్సై సురేష్, తోటి ఉద్యోగులు సంతాపం తెలిపారు.